ఇదేమి కుమ్ముడు సామి…శివరాత్రి కి ఇస్మార్ శంకర్ వీరంగం!! | 123Josh.com
Home న్యూస్ ఇదేమి కుమ్ముడు సామి…శివరాత్రి కి ఇస్మార్ శంకర్ వీరంగం!!

ఇదేమి కుమ్ముడు సామి…శివరాత్రి కి ఇస్మార్ శంకర్ వీరంగం!!

0
15078

తాజాగా మరోసారి శివరాత్రి సందర్బంగా పలు చిత్రాలతో పోటీ పడ్డ ఇస్మార్ట్ శంకర్ విన్నర్ గా నిలిచింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా శివరాత్రి సందర్బంగా ప్రత్యేక ఆటలను ప్రదర్శిస్తూ ఉంటారు. అర్థరాత్రి 12 గంటలకు ఆ తర్వాత 2.30 నిమిషాలకు రెండు ఆటలను ప్రదర్శించారు.

క్రాస్ రోడ్స్ లో రెండు థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ ప్రదర్శించగా దాదాపుగా 1.25 లక్షల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయట. ఇక ఎన్టీఆర్ అరవింద సమేతను కూడా రెండు షోలకు గాను ప్రదర్శించా లక్ష లోపు వసూళ్లు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

గీత గోవిందం.. సరైనోడు.. గద్దల కొండ గణేష్ లు కనీసం 25 వేల మార్క్ ను కూడా దాటలేక పోయినట్లుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగస్థలం చిత్రం కూడా శివరాత్రి సినిమాల జాబితాలో ఉంది. కాని అది కూడా పెద్దగా వసూళ్లను దక్కించుకున్న దాఖలాలు కనిపించలేదు. మొత్తానికి శివరాత్రికి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అందరు హీరోల సినిమాలను పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here