ఇదేమి టైటిల్ సామి…వింతగా ఉందే!! | 123Josh.com
Home గుసగుసలు ఇదేమి టైటిల్ సామి…వింతగా ఉందే!!

ఇదేమి టైటిల్ సామి…వింతగా ఉందే!!

0
1245

అల్లు అర్జున్ త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న మూవీ షూటింగ్ చకచకా సాగుతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికి అనుగుణంగా పక్కా ప్లానింగ్ తో పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లుండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యూనిట్ టైటిల్ ప్రకటిస్తామని అధికారికంగా చెప్పిన సంగతి తెలిసిందే.

ఎప్పటి నుంచో దీని గురించి నేను నాన్న – అలకానంద అనే రెండు పేర్లు ప్రచారంలో ఉంటూ వచ్చాయి. నేను నాన్న రిజిస్టర్ కూడా చేశారని చెప్పుకున్నారు. కానీ అవేవి కాదని త్రివిక్రమ్ మరో షాకింగ్ టైటిల్ రెడీ చేయించి ఉంచాడట. అదే వైకుంఠపురంలో. చాలా వెరైటీగా ఉంది కదూ.

అత్తారింటికి దారేది అనౌన్స్ చేసినప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ కి ఈ మాటల మాంత్రికుడు ఇలాగే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ అభిమానుల వంతు వచ్చింది. ఇదైతే విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఖచ్చితంగా ఒకటైతే ఫిక్స్ చేసి ఉంటారు. లోగోతో సహా విడుదల చేయాలి కాబట్టి ఈ రెండు రోజులూ ఆలోచిస్తూ ఉండేంత టైం ఉండకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here