ఇదేమి న్యూస్ సామి…టాలీవుడ్ అండ్ కోలివుడ్ రెండూ షేక్ అయ్యాయి!! | 123Josh.com
Home గుసగుసలు ఇదేమి న్యూస్ సామి…టాలీవుడ్ అండ్ కోలివుడ్ రెండూ షేక్ అయ్యాయి!!

ఇదేమి న్యూస్ సామి…టాలీవుడ్ అండ్ కోలివుడ్ రెండూ షేక్ అయ్యాయి!!

0
2475

రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నయనతార.. ఖుష్బు.. కీర్తి సురేష్.. మీనా వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా లో కీలక పాత్రకు గాను గోపీచంద్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

హీరోగా పరిచయం అయిన గోపీచంద్ మొదట్లో సక్సెస్ రాక పోవడంతో విలన్ గా మారాడు. విలన్ గా మూడు సక్సెస్ లు దక్కిన తర్వాత మళ్లీ హీరోగా మారి వరుసగా హీరోగా చిత్రాలు చేశాడు. మళ్లీ ఈమద్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ మళ్లీ విలన్ వేషాలు వేయాలనుకుంటున్నాడట. అందుకే రజినీకాంత్ మూవీ కోసం దర్శకుడు శివ ఈయన్ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

దర్శకుడు శివ కెరీర్ ఆరంభంలో గోపీచంద్ తో శౌర్యం.. శంఖం చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు శివకు మంచి బూస్ట్ ఇచ్చాయి. అందుకే గోపీచంద్ ను శివ మర్చి పోలేదని చెప్పుకోవచ్చు. అందుకే రజినీకాంత్ మూవీలో గోపీచంద్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటాడు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here