ఇదేమి న్యూస్ సామి…ఫ్యాన్స్ ఒకటే టెన్షన్ పడుతున్నారు గా!! | 123Josh.com
Home గుసగుసలు ఇదేమి న్యూస్ సామి…ఫ్యాన్స్ ఒకటే టెన్షన్ పడుతున్నారు గా!!

ఇదేమి న్యూస్ సామి…ఫ్యాన్స్ ఒకటే టెన్షన్ పడుతున్నారు గా!!

0
889

నాటి విప్లయ యోధుడు కొమరంభీమ్ పులి తో వాస్తవం లో పోరాడారో.. లేదో ? తెలియదు కానీ ఆర్.ఆర్.ఆర్ లో మాత్రం ఆ సన్నివేశం హైలైట్ గా నిలవడం ఖాయం అన్న చర్చా సాగింది. తాజాగా భీమ్ పులిపైనే కాదు…రామ్ పైనా దాడి చేయడం తెరపై చూస్తారన్న టాప్ సీక్రెట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేసేయడం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఎన్టీఆర్ కేవలం పులితోనే పోరాటం చేసాడు.. ఆ ఫైట్ సీన్ సినిమా కే హైలైట్ గా నిలుస్తుందని ప్రచారమైంది. కానీ అంతకు మించి వెడెక్కించే మరో సన్నివేశం భీమ్ – రామ్ ఫైట్ అని తాజాగా రివీల్ చేసారు. అల్లూరి సీతారామరాజు(చరణ్)తో కొమురం భీమ్ (ఎన్టీఆర్) ఎటాక్ ఉత్కంఠ పెంచుతుందట. అటుపై అల్లూరి పాత్రధారి రామ్ తిరగబడతాడుట.

ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల పాటు భీకర పోరాట దృశ్యం రక్తి కట్టిస్తుందని లీకు అందింది. ఈ ఒక్క సన్నివేశాన్ని జక్కన్న రెండు వారాలకు పైగా షూట్ చేసారుట. అందుకు ప్రత్యేకమైన సెట్లు వేసి మరీ కేర్ తీసుకున్నారని తెలిసింది. ఈ సీన్ కూడా ఔట్ డోర్ లో షూట్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మాట ఆనోటా.. ఈనోటా వైరల్ అయ్యి.. చివరికి సోషల్ మీడియాలో వాడి వేడి చర్చకు తావిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది సినిమా చూస్తే గానీ తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here