ఇదే టైటిలా…కొత్తగా ఉందే!! | 123Josh.com
Home గుసగుసలు ఇదే టైటిలా…కొత్తగా ఉందే!!

ఇదే టైటిలా…కొత్తగా ఉందే!!

0
1485

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అంటే గతంలో తెలుగువారు మాత్రమే ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.  నిజానికి కొన్ని ఇతరదేశాలలో కూడా రాజమౌళి చిత్రంపై ఆసక్తి అవుతోంది. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో ‘RRR’ రూపొందిస్తున్నారు. 

ఈ సినిమాకు ‘RRR’ వర్కింగ్ టైటిల్ లాంటిదే కానీ పూర్తి స్థాయి టైటిల్ కాదనే సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ‘RRR’ టీమ్ మూడు ఆర్ లు సరిపోయేలా టైటిల్ సూచించాలని ప్రేక్షకులను కోరింది.  అప్పటి నుంచి ఈ ఎంతోమంది నెటిజన్లు టైటిల్స్ ను సూచించారట.  గతంలో ఈ టైటిల్స్ పై కొన్నివార్తలు కూడా వచ్చాయి. 

అయితే ఈ టైటిల్ పై ఫిలిం నగర్ లో వినిపిస్తున్న ఫ్రెష్ టాక్ ఏంటంటే రాజమౌళి టీమ్ రెండు టైటిల్స్ ను ఫైనల్ లిస్టులో ఉంచారట.  అందులో సౌత్ వెర్షన్లకు ‘రామ రౌద్ర రుషితం’ ను పరిశీలిస్తున్నారని.. ఇతర భాషల్లో ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వేచి చూడక తప్పదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here