ఇవాల్టి నుండి చావో రేవో….సాహో కి అగ్ని పరీక్ష!! | 123Josh.com
Home న్యూస్ ఇవాల్టి నుండి చావో రేవో….సాహో కి అగ్ని పరీక్ష!!

ఇవాల్టి నుండి చావో రేవో….సాహో కి అగ్ని పరీక్ష!!

0
1249

సాహోకు భయపడి ఏ భాషలోనూ ఏ నిర్మాతా పోటీకి దిగలేదు. ముందు ఫిక్స్ చేసుకున్న చిచోరే లాంటి హిందీ సినిమాలు సైతం వారం వాయిదా వేసుకున్నాయి. సూర్య బందోబస్త్ ఏకంగా 20 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇది ప్రధానంగా వర్క్ అవుట్ అయిన అంశం. ఇక నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ మరో రీజన్. వరస సెలవులు కాబట్టి పబ్లిక్ కి సినిమా ఎంటర్ టైన్మెంట్ ఉండాల్సిందే.

ఏ సెంటర్ చూసినా ప్రతి థియేటర్లోనూ దాదాపు సాహోనే ఉంటే ఇక వేరే ఛాయస్ పెట్టుకునే ఆప్షన్ ఎక్కడిది. అందుకే సాహోకు నాలుగు రోజులు తిరుగు లేకుండా పోయింది. కానీ ఇవాళ నుంచి సీన్ మారుతుంది. వీక్ డేస్ కాబట్టి డ్రాప్ ఖాయమే. కాకపోతే అది ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. స్క్రీన్లు తక్కువగా ఉండే బిసి సెంటర్స్ లో ఇప్పటికే అదనపు థియేటర్లలో వేసిన సాహోని రీ ప్లేస్ చేశారని వార్తలున్నాయి.

మెయిన్ స్క్రీన్ మాత్రమే కంటిన్యూ చేస్తారన్న మాట. సో ఇప్పుడీ నెగటివ్ టాక్ ఎంతమేరకు సాహోని నిలబెడుతుందో చూడాలి. పైగా ఏపిలో చాలా కేంద్రాల్లో టికెట్ ధర సెప్టెంబర్ 5 దాకా 200 రూపాయల దాకా ఉండటం క వసూళ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకో వారం గడిస్తే కానీ సాహో ఏ మేరకు సేఫ్ అవుతుందో క్లారిటీ రాదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here