ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ రేంజ్ ఎంతో తేల్చేసిన చార్మీ!! | 123Josh.com
Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ రేంజ్ ఎంతో తేల్చేసిన చార్మీ!!

ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ రేంజ్ ఎంతో తేల్చేసిన చార్మీ!!

0
3435

పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉందంటే హిట్ అయితే ఒక బాధ ఫ్లాప్ అయితే మరో టార్చర్. ఏది జరిగినా నిర్మాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్లాక్ బస్టర్ అయినా ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి వస్తే ఇంకేం చెప్పాలి. పూరి కనెక్ట్స్ లో మెయిన్ పార్ట్ నర్ గా ఉన్న ఛార్మీకి ఇది ప్రత్యక్షంగా అనుభవమవుతోంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు ముందు అధిక శాతం డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన ఛార్మీని కాళ్లు గెడ్డాలు పట్టి బ్రతిమాలుకుని ఇవ్వాల్సిన దాని కన్నా తక్కువ ధరకే ఇస్మార్ట్ శంకర్ ను మాట్లాడుకుని అడ్వాన్సు ఇచ్చి వెళ్ళిపోయారు. సరే సక్సెస్ అయ్యాక ఎలాగూ మొత్తం తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఛార్మీ సరే అంది.

కట్ చేస్తే బొమ్మ మాములు హిట్ అవ్వలేదు. కేవలం షేర్ 50 కోట్లు దాటేసి ఔరా అనిపించింది.  ఎక్కడా చూసిన ఓవర్ ఫ్లోస్ వచ్చాయి. పోటీ లేని సీజన్ ని బ్రహ్మాండంగా వాడుకున్న ఇస్మార్ట్ శంకర్ అన్ని చోట్లా రూపాయకు రెండు రూపాయలు సంపాదించి పెట్టాడు. ఈ లెక్కన ఛార్మీకి లావాదేవీలకు సంబంధించి సుమారు 40 కోట్ల దాకా ఇంకా లెక్కలు తేలాల్సి ఉందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here