ఈయన మాస్ ముందు ఎవ్వరూ నిలవలేరు…!! | 123Josh.com
Home న్యూస్ ఈయన మాస్ ముందు ఎవ్వరూ నిలవలేరు…!!

ఈయన మాస్ ముందు ఎవ్వరూ నిలవలేరు…!!

0
2777

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా అది అభిమానులకు పండగే. 68 వయసులోనూ ఆయన అలుపన్నదే లేకుండా సినిమాల్లో నటిస్తూ రాజకీయారంగేట్రానికి రెడీ అవుతుంటే ఫ్యాన్స్ లోనూ అంతే ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీ `దర్బార్` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ సహా రకరకాల పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. `దర్బార్` టైటిల్ కి తగ్గట్టే సూపర్ స్టార్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు.తాజాగా దర్బార్ సెకండ్ లుక్ సామాజిక మాధ్యమాల్లో రివీలైంది. ఇందులో రజనీ సింహగర్జన కనిపిస్తోంది.

ఒక రకంగా రజనీ మార్క్ ముఖ కవలికలతో పోస్టర్ రక్తి కట్టిస్తోంది. అసలు వయసుతో సంబంధం లేకుండా చొక్కా విప్పి రజనీ చూపించిన గ్రేస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోకి చిత్ర దర్శకుడు మురుగదాస్ అదిరిపోయే క్యాప్షన్ ని ఇచ్చారు. “యంగర్.. స్మార్టర్.. వైజర్.. ఠఫ్పర్.. తలైవార్ నెవ్వర్ సీన్ బిఫోర్ అవతార్“ అంటూ మురుగ ఉద్వేగానికి లోనయ్యారు. మొత్తానికి రజనీ న్యూలుక్ ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here