ఈ ఒక్క డైలాగ్ చాలు…సైరా ఎంత స్పెషలో చెప్పడానికి!! | 123Josh.com
Home న్యూస్ ఈ ఒక్క డైలాగ్ చాలు…సైరా ఎంత స్పెషలో చెప్పడానికి!!

ఈ ఒక్క డైలాగ్ చాలు…సైరా ఎంత స్పెషలో చెప్పడానికి!!

0
4142

`సైరా` ప్రీరిలీజ్ వేదికపై మెగా హీరోల స్పీచ్ లతో పాటు.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇచ్చిన స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అయితే ఆయన మెగాస్టార్ చిరంజీవిపైనా.. రామ్ చరణ్ పైనా.. పరుచూరి వారిపైనా ప్రశంసల వర్షం కురిపించడమే గాక.. మరో ముఖ్యమైన మాటను గుచ్చి గుచ్చి మాట్లాడారు.

అదేమిటంటే బాహుబలిని మించి వీఎఫ్ ఎక్స్ ని `సైరా` చిత్రం కోసం ఉపయోగించారన్నది ఆయన ప్రశంస. బాహుబలి2కి 2200 షాట్లు సుమారుగా ఉపయోగిస్తే.. సైరా చిత్రం కోసం ఏకంగా 3800 వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉపయోగించారన్నది ఎస్.ఎస్.రాజమౌళి హైలైట్ చేశారు.

ఇందుకోసం ఏకంగా 45కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. మరో ముఖ్యమైన మాటను ఈ వేదికపై రాజమౌళి గుర్తు చేశారు. కమల్ కన్నన్.. నాకు సైరా వీఎఫ్ ఎక్స్ షాట్స్ గురించి చెప్పారు. అయితే అది ఎంత కష్టమో నాకు తెలుసు. అన్నివందల వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉపయోగిస్తే దాంతో పాటే ఎక్కడా ఎమోషన్ మిస్సవ్వకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here