ఈ న్యూస్ నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనంజా ఖాయం!! | 123Josh.com
Home గుసగుసలు ఈ న్యూస్ నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనంజా ఖాయం!!

ఈ న్యూస్ నిజం అయితే మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనంజా ఖాయం!!

0
1253

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రను పోషించనున్నాడు. ఈ పాత్రలో ఇంటెన్సిటీ రంగస్థలం చిట్టిబాబుకు ఏమాత్రం తగ్గదట. తండ్రి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడని ఓ లీక్ అందింది.

త్వరలో రాజమండ్రిలో షూట్ కి హాజరవుతాడన్న గుసగుసా వేడెక్కిస్తోంది. ఈ చిత్రంలో యువ చిరంజీవిగా చెర్రీ నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చిరు సరసన త్రిషను ఖాయం చేశారు కాబట్టి చెర్రీకి నాయికను ఫైనల్ చేయాల్సి ఉందిట.

ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో కలిసి మాట్నీ ఎంటర్ టైన్మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సోషియో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ చిత్రమిదని చెబుతున్నారు. ఇందులో నక్సలైట్ పాత్రలో చరణ్ మెరిపిస్తారు అన్నది ఆసక్తిని పెంచే మ్యాటరే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here