మాస్ లో బాస్ గా టాలీవుడ్ లో రికార్డ్ బ్రేకింగ్ స్టంట్స్ తో అదరగొట్టిన రికార్డ్ నట సింహం నందమూరి బాలకృష్ణ సొంతం. ఇప్పుడు మరో పవర్ ఫుల్ టైటిల్ ఆయన ఖాతాలో చేరబోతోంది.
`బాలరామయ్య బరిలో దిగితే` అనేది ఆ టైటిల్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ బాలయ్యకు ఒక కథను వివరించారని ఇది చాలా పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్సెస్ తో రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు.
నందమూరి నట సింహాం మరో శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని టైటిల్ ను బట్టి అర్థమవుతోంది. బాలయ్య బరిలో దిగితే బంతాటేనని మాస్ డైరెక్టర్ సంతోష్ స్క్రిప్ట్ ఆ రేంజులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మాస్ సీన్స్ లో బాలయ్యను ఓ రేంజులో చూపించే సత్తా ఆయనకు ఉంది. అనీల్ సుంకర ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని నిర్మించనున్నారు.