ఎన్టీఆర్ తో కొత్త డైరెక్టర్…నిజం అయితే రచ్చ రంబోలా ఖాయం!

0
11295

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేశాక త్రివిక్రమ్ తో సినిమా కోసం సీరియస్ గా థింక్ చేస్తున్న ఎన్టీఆర్ అటుపైనా కేజీఎఫ్ డైరెక్టర్ కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ల తో పని చేయాలని ఆలోచిస్తున్నాడు.

సరిగ్గా ఇలాంటి సమయంలో ఓ యంగ్ డైరెక్టర్ తన స్క్రిప్ట్ వినిపించి తారక్ కి ఒప్పించారన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్. ఈ ఏడాది ఆరంభంలో ప్రశంసలు పొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `హిట్`తో పరిశ్రమలో అడుగుపెట్టిన యువ దర్శకుడు సైలేష్ కోలను వినిపించిన స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చేసిందట. సైలేష్ ఇటీవల దిల్ రాజుకు స్క్రిప్ట్ వివరించాడు.

అటుపై ఆయన ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్ళారట. స్క్రిప్ట్ విన్న తరువాత ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయాలన్న ఉత్సాహం చూపించారట. అయితే దేనికైనా స్క్రిప్ట్ పూర్తి అయ్యి అధికారికంగా ప్రకటించాకే కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here