ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న మహేష్…ఈ సెంటిమెంట్ ఏంటి సామి!! | 123Josh.com
Home న్యూస్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న మహేష్…ఈ సెంటిమెంట్ ఏంటి సామి!!

ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న మహేష్…ఈ సెంటిమెంట్ ఏంటి సామి!!

0
945

సినిమా ప్రమోషన్స్ లో 9 అంకె సెంటిమెంట్ అందరినీ విస్మయపరుస్తోంది. తొమ్మిది (9) సెంటిమెంటుతోనే మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు దానినే అనుసరిస్తున్నారట. మహర్షి టైమ్ లో టీజర్.. పోస్టర్.. పాటల్ని రిలీజ్ చేసినప్పుడు డేట్ లో మొత్తం అంకెల్ని కలిపితే 9 (తొమ్మిది) వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ఆ సెంటిమెంట్ వర్కవుటై సినిమాకి మంచి హిట్టయ్యిందని మహేష్ టీమ్ భావిస్తోందట.

ఆ సెంటిమెంటును ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ లోనూ ఫాలో అవుతోంది అందుకే. ఈ సినిమా నుంచి ఏ ఒక్క పోస్టర్ రిలీజ్ చేసినా.. టీజర్ రిలీజ్ చేసినా సాయంత్రం 5.04 నిమిషాలకు అంటూ ప్రకటిస్తున్నారు. ఆ రెండు నంబర్లను కలిపితే తొమ్మిది (9) వస్తుంది. అది తమకు సెంటిమెంటుగా కలిసొస్తోందని చిత్రబృందం నమ్ముతోందట. నేటి (సోమవారం) సాయంత్రం రిలీజైన `మైండ్ బ్లాక్` పాటకు అదే సెంటిమెంటును ఫాలో చేస్తూ 5.04 పీఎం కి రిలీజ్ చేశారు.

ఇకపై రిలీజయ్యే ప్రతి పాటను ఇదే సమయానికి రిలీజ్ చేస్తారట. 5.04 పీఎం సెంటిమెంటును వదిలిపెట్టరట. లేదంటే అన్ని అంకెల్ని కలిపితే 9 వచ్చేలా చూసుకుని పాటల్ని రిలీజ్ చేస్తారు. ప్రతి సోమవారం మాస్ ఎంబీ సాంగ్స్ సాయంత్రం 5.04 పీఎంకే వస్తాయని ఫిక్సయిపోవచ్చు. ఈనెలంతా ఫ్యాన్స్ కి ఈ ట్రీట్ ఉంటుంది. ఇక తొమ్మిది నంబర్ ఎన్టీఆర్ కి కూడా సెంటిమెంట్. తనలానే మహేష్ కూడా ఆ నంబర్ సెంటిమెంటును అనుసరిస్తున్నారంటూ ఓ సెక్షన్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తుండడం ఆసక్తికరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here