అలా వైకుంఠపురంలో సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కు సంబంధించి ఇప్పటికే కథ ఒకే అయ్యింది. ఆ కథకు తగ్గట్లుగా అయినను పోయి రావాలి హస్తినకు అనే టైటిల్ ను అనుకున్నారు.
కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ మరో టైటిల్ ను సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ రెడీ చేసిన కథ పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని అంటున్నారు. అందుకే తెలుగు తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఇంకా హిందీలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.
అన్ని భాషలకు కూడా ఒకే టైటిల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అన్ని కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో వచ్చాయి. అందుకే ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చి క్యాచీ గా అందరికి సింపుల్ గా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.