ఎన్టీఆర్-మంచు మనోజ్…ఒక అబద్దం! | 123Josh.com
Home గుసగుసలు ఎన్టీఆర్-మంచు మనోజ్…ఒక అబద్దం!

ఎన్టీఆర్-మంచు మనోజ్…ఒక అబద్దం!

0
7893

త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేయనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లోపు విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ ప్రస్తుతం కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టాడట.

ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తారని ఇదివరకే కన్ఫర్మ్ చేసాడు. మరో విషయం ఏంటంటే.. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారట.

ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తాడని వార్తలొచ్చాయి. ఆ వార్తల పై మంచు మనోజ్ స్పందించి.. “నన్ను ఎన్టీఆర్ సినిమా గురించి ఎవరు సంప్రదించలేదని తేల్చేసాడు. అయినా నేను విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమే.. కానీ దానికి ఇంకా టైం ఉంది” అని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here