ఎన్టీఆర్- మంచు మనోజ్…లేటెస్ట్ అప్ డేట్!! | 123Josh.com
Home గుసగుసలు ఎన్టీఆర్- మంచు మనోజ్…లేటెస్ట్ అప్ డేట్!!

ఎన్టీఆర్- మంచు మనోజ్…లేటెస్ట్ అప్ డేట్!!

0
5804

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ (చిన్నబాబు) – కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా వచ్చి అన్ని తారుమారు చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

తారక్ సినిమాలో మంచు హీరో మనోజ్ కూడా యాక్ట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎన్టీఆర్ కి ప్రతి నాయకుడిగా నటించబోతున్నాడట. అయితే పూర్తిగా నెగిటివ్ రోల్ కాకుండా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న స్టైలిష్ విలన్ అని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here