ఎన్టీఆర్ వేసిన స్టెప్ వేస్తె కాలు విరిగిందట ఈ హిరో కి! | 123Josh.com
Home గుసగుసలు ఎన్టీఆర్ వేసిన స్టెప్ వేస్తె కాలు విరిగిందట ఈ హిరో కి!

ఎన్టీఆర్ వేసిన స్టెప్ వేస్తె కాలు విరిగిందట ఈ హిరో కి!

0
816

తెలుగు చిత్రసీమలో ఉన్న హీరోలందరితో ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. చేసిన ప్రతీ సినిమాతో పరిణితి పెంచుకుంటూ వస్తున్న ఆయన దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించారు. ఇకపోతే ఎన్టీఆర్ డాన్స్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆల్ ఇండియా వైడ్ ఫుల్ ఫేమస్. ఆయన డాన్స్ మీద టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీల్లోని ఎందరో నటీనటులకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేకాదు మనోడి స్టెప్స్ అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా.

సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావించారు బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన నీల్ నితిన్ ఓ మీడియాతో మాట్లాడుతూ తెలుగు టాప్ హీరోల గురించి కామెంట్ చేశాడు. తనకు తెలుగులో  అన్ని సినిమాలు – సూపర్ స్టార్స్ అందరూ ఇష్టమని చెప్పిన ఆయన.. ప్రత్యేకంగా ఎన్టీఆర్ గురించి – ఆయన డాన్స్ గురించి చెప్పాడు.

తెలుగులో తాను చూసిన డాన్సుల్లో చాలా కష్టమైన డ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ది అని నితీశ్ అన్నాడు. లైవ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టేజీపై చేసిన ఒక స్టెప్ చూశానని.. ఆ స్టెప్  చేద్దామని ప్రయత్నిస్తే కాలు విరుగుతుందని చెప్పాడు. కాబట్టి తాను ఎన్టీఆర్ ని అనుసరించను అని అన్నాడు నీల్ నితిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here