ఎవ్వరూ తగ్గం అంటున్నారు…దెబ్బ పడేది మీకే మరి!! | 123Josh.com
Home గుసగుసలు ఎవ్వరూ తగ్గం అంటున్నారు…దెబ్బ పడేది మీకే మరి!!

ఎవ్వరూ తగ్గం అంటున్నారు…దెబ్బ పడేది మీకే మరి!!

0
1686

జనవరి 12న ఒకే తేదీకి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రావాలని డిసైడ్ కావడమే. ఆ మేరకు జోరుగా ప్రకటనలు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ టైంలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు అకామడేట్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కనీసం ఒక్క రోజు గ్యాప్ ఇచ్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇది ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది.

కానీ ఒకే డేట్ కి క్లాష్ అయితే మాత్రం ఓపెనింగ్స్ ని పంచుకోక తప్పదు.ఏదైనా ఒకదానికి టాక్ కొంచెం అటుఇటుగా వచ్చినా అపోజిషన్ సినిమాకు అడ్వాంటేజ్ దక్కుతుంది. దీని వల్ల ప్రేక్షకులకు నష్టం లేదు కానీ మధ్యలో బలయ్యేది బయ్యర్లే. అందుకే ఇప్పుడీ పంచాయితీ పట్ల కొనుగోలుదారులు సదరు నిర్మాతల దగ్గర ఈ క్లాష్ విషయంగా రాజీ మార్గం వెతకమని మొత్తుకుంటున్నారట.

మహేష్ బాబు అల్లు అర్జున్ ల ఇమేజ్ మార్కెట్ ఒకటా లేక ఎవరు ఎక్కువ తక్కువా అనే లెక్కలు పక్కన పెడితే మొదటి రోజు వసూళ్లు ఇద్దరికీ చాలా కీలకం. అందులోనూ దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. మూవీ లవర్స్ రెండూ చూడడానికి ఇష్టపడతారు. అయితే గ్యాప్ ఉంటేనే వాళ్ళకైనా ఆప్షన్ ఉంటుంది. అలా కాకుండా ఒకే రోజు రెండూ చూడటం అంటే ఇబ్బందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here