ఏంటయ్యా విజయ్….ఈ రేంజ్ లో పడిపోయావెంటి!! | 123Josh.com
Home న్యూస్ ఏంటయ్యా విజయ్….ఈ రేంజ్ లో పడిపోయావెంటి!!

ఏంటయ్యా విజయ్….ఈ రేంజ్ లో పడిపోయావెంటి!!

0
3511

లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విజయ్ సినిమా ‘డియర్ కామ్రేడ్’ చేదు ఫలితాన్ని అందుకుంది. సౌత్ అంతా మెప్పించాలని నాలుగు భాషలలో విడుదల చేస్తే అన్ని చోట్ల ఒకేరకమైన ఫలితం వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపించాయని కూడా విమర్శలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా.. సెకండ్ హాఫ్ మరో సినిమా అని కూడా విమర్శించారు. సీన్ కట్ చేస్తే తాజాగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదలయింది. దీని పరిస్థితి కూడా భిన్నంగా లేదు.

‘అర్జున్ రెడ్డి’ ప్రభావం నుంచి విజయ్ బయటకు రాలేకుండా ఉన్నాడని విమర్శలు వచ్చాయి. అసలు కథ.. ఉపకథలు.. విజయ్ పాత్రలో బోలెడంత తికమక ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ సినిమా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. సినిమా రిజల్ట్ అలా ఉంటే.. విజయ్ మార్కెట్ ఎంత తగ్గిందో అనేదానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

‘గీత గోవిందం’ సినిమాకు 70 కోట్లకు పైగా షేర్ వచ్చింది. గ్రాస్ లెక్క అయితే 100 కోట్లు దాటింది. విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇదే. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కలెక్షన్లు ఫుల్ రన్ లో రూ.10 కోట్ల షేర్ కూడా దాటేలా లేవు. విజయ్ ఒక స్టార్ హీరో అని చాలామంది అంటూ ఉన్నారు కానీ విజయ్ మార్కెట్ మాత్రం ఇంకా స్టెబిలైజ్ కాలేదని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కలెక్షన్లు సూచిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here