ఓరినీ…వెంకీ మామ బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!! | 123Josh.com
Home గుసగుసలు ఓరినీ…వెంకీ మామ బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!

ఓరినీ…వెంకీ మామ బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!

0
1430

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్యల కాంబోలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ మామ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ లో విడుదల చేసే ప్లాన్ తో ఒకపక్క నిర్మాత సురేష్ బాబు బిజినెస్ డీల్స్ కూడా చేస్తున్నారు. దీనికి సుమారుగా 50 కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి సురేష్ బాబు ఎంత తమ్ముడైన అల్లుడైనా చాలా క్యాలికులేటెడ్ గా రిస్క్ తగ్గించుకుని తన నిర్మాణంలో సినిమాలను ప్లాన్ చేస్తుంటారు. ఒకప్పుడు పరిమితులు పెట్టుకునే వారు కాదు కానీ ఇప్పుడు మాత్రం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే సాగుతున్నారు. అందుకే సోలో ప్రొడక్షన్ వదిలేసి జాయింట్ వెంచర్లలోనే పెట్టుబడులు పెడుతున్నారు.

వెంకీ మామలో సైతం మరో ఇద్దరు పార్ట్ నర్స్ ఉన్నప్పటికీ మొత్తం అంతా సురేష్ బాబు కనుసన్నల్లోనే జరుగుతోందని వినికిడి. ఇదిలా ఉండగా నిజంగా వెంకీ మామకు 50 కోట్ల బడ్జెట్ అంటే తేలికైన విషయం కాదు. విడిగా వెంకీ చైతులకు అంత షేర్ తెచ్చే మార్కెట్ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here