ఓవర్సీస్ లో మన్మథుడు 2 కి ఎదురుదెబ్బ… పరిస్థితి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! | 123Josh.com
Home న్యూస్ ఓవర్సీస్ లో మన్మథుడు 2 కి ఎదురుదెబ్బ… పరిస్థితి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

ఓవర్సీస్ లో మన్మథుడు 2 కి ఎదురుదెబ్బ… పరిస్థితి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

0
672

మన్మధుడు 2 చిత్రం ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు ఓవర్సీస్ లోనూ ఆశించిన  రిజల్ట్ దక్కించుకోలేదని తాజాగా రివీలైన బాక్సాఫీస్ గణాంకాలు చెబుతున్నాయి. తొలి రోజు విమర్శకుల నుంచి వచ్చిన మిశ్రమ స్పందనలు రావడం ఒకరకంగా మన్మధుడికి మైనస్ గా మారిందనే చెప్పాలి. వాస్తవంగా కింగ్ నాగార్జున ఓవర్సీస్ రేంజ్ ఎంత? అంటే అతడు నటించిన మనం.. ఊపిరి లాంటి సినిమాల్ని ఉదహరిస్తారు.

అమెరికాలో ఈ చిత్రాలో మిలియన్ డాలర్ క్లబ్ (10లక్షల డాలర్లు)లో చేరాయి. అందుకే ఈసారి మన్మధుడు 2 కూడా ఆ స్థాయిని అందుకుంటుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. కానీ ఈ చిత్రం అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ఓపెనింగ్స్ పరంగా వెనకబడిందని తాజా రిపోర్ట్ చెబుతోంది. అమెరికాలో  150 పైగా లొకేషన్లలో రిలీజైన ఈ చిత్రం తొలి వీకెండ్ కేవలం 2లక్షల డాలర్లతోనే సరిపుచ్చుకుంది.

ప్రీమియర్స్ ద్వారా $82190 వసూళ్లు సాధించింది. తొలిరోజు గురువారం ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత రివ్యూల ప్రభావంతో పూర్తిగా కలెక్షన్స్ పడిపోయాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ తో కలుపుకొని మూడు రోజులకు గాను  $215k వసూళ్లు సాధించింది. ఇక సెలవు దినం ఆదివారం అదే రిజల్ట్ రిపీటైందని తెలుస్తోంది. నాలుగు రోజులలో రణరంగంఎవరు వంటి చిత్రాల విడుదల నేపథ్యంలో మన్మధుడు 2 కలెక్షన్స్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here