కరోనా ఎఫెక్ట్…ఫస్ట్ బిగ్ మూవీ కి కష్టాలు!! | 123Josh.com
Home గుసగుసలు కరోనా ఎఫెక్ట్…ఫస్ట్ బిగ్ మూవీ కి కష్టాలు!!

కరోనా ఎఫెక్ట్…ఫస్ట్ బిగ్ మూవీ కి కష్టాలు!!

0
1671

విజయ్ ‘మాస్టర్’ సినిమా తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. తెలుగులో కరోనా వలన వాయిదా పడ్డ సినిమాలన్నీ ఏప్రిల్ లో రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమాలు కేవలం తెలుగులోనే 10 పైనే ఉన్నాయి.

మరి వాటికీ థియేటర్లు దొరకడమే కష్టమని కంగారు పడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ సమయంలో విజయ్ నుండి మాస్టర్ సినిమా తెలుగులో రిలీజ్ అయితే గనుక అసలు థియేటర్లు దొరకడం చాలా కష్టం. తెలుగు జనానికి విజయ్ సుపరిచితుడే. స్నేహితుడు తుపాకీ విజిల్ సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే.

మరి ఇంత క్లిష్టమైన టైంలో సినిమా వస్తే థియేటర్లు దొరకక ప్రేక్షకులకు రీచ్ అవ్వకపోతే ఎలా అని మాస్టర్ దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. అనిరుధ్ సంగీత సారధ్యం వహిస్తున్న మాస్టర్ సినిమా పరిస్థితి ఏం కానుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here