కొత్త లుక్ లో కుమ్మేసిన విశాల్…కొత్త సినిమా టీసర్ ఎప్పుడంటే!! | 123Josh.com
Home గుసగుసలు కొత్త లుక్ లో కుమ్మేసిన విశాల్…కొత్త సినిమా టీసర్ ఎప్పుడంటే!!

కొత్త లుక్ లో కుమ్మేసిన విశాల్…కొత్త సినిమా టీసర్ ఎప్పుడంటే!!

0
2297

యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కొలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా ‘టెంపర్’ సినిమా రీమేక్ తో తమిళ ప్రేక్షకులను మెప్పించిన విశాల్ తాజాగా ‘యాక్షన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకు తెలుగులో కూడా సేమ్ టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం. 

యాక్షన్ చిత్రాల హీరోకు ఇంత కంటే బెస్ట్ టైటిల్ ఏముంటుంది? ఈరోజు సాయంత్రం 5 గంటలకు ‘యాక్షన్’ సినిమా టీజర్ ను విడుదల చేస్తామంటూ ఫిలింమేకర్స్ ప్రకటించారు.  ఈ విషయాన్ని తెలుపుతూ ఒక టీజర్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ఈ పోస్టర్ లో విశాల్ ఒక బైక్ పై కూర్చొని హీరోయిన్ తమన్నావైపుకు చూస్తున్నాడు. ఇక తమన్నా ఒక గ్లామరస్ డ్రెస్ లో నడుస్తూ విశాల్ ను చూస్తోంది.  మంచు కొండల నేపథ్యం చూస్తుంటే ఈ సినిమాలో ఒక పాటలోని స్టిల్ లాగా అనిపిస్తోంది.  ఈ పోస్టర్ లోనే సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here