కొమురం భీమ్…ఫ్యాన్ మేడ్ కే పూనకాలు!! | 123Josh.com
Home న్యూస్ కొమురం భీమ్…ఫ్యాన్ మేడ్ కే పూనకాలు!!

కొమురం భీమ్…ఫ్యాన్ మేడ్ కే పూనకాలు!!

0
668

రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం లుక్ ని రివీల్ చేస్తూ ఆగస్ట్ 15న పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారని అందులో సారాంశం. చూస్తే అది డివివి కానీ ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చింది కాదు.

పోనీ రాజమౌళి చరణ్ తారక్ లు ఎవరైనా షేర్ చేశారా అంటే అదీ లేదు. ఎవరో అభిమాని సృష్టించిన టైపులో దానిలో మ్యాటర్ ఉంది. కానీ అది నిజమే అనుకుంటున్న అభిమానులు దాన్ని చాలా దూరం తీసుకెళ్లిపోయారు. దీంతో ఇలాంటి వాటి మీద పెద్ద అవగాహన లేని వాళ్ళు తమ హీరో లుక్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు.

కాస్త లోతుగా వెళ్లి విచారించి చూస్తే ఇది నాగార్జున అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని స్వంతంగా డిజైన్ చేసి ఆన్ లైన్ లో వదిలాడని తెలిసింది. పోస్టర్ లుక్ లోగోలు అచ్చం అఫీషియల్ అనిపించేలా ఉండటంతో ఓ మీడియా వర్గం సైతం దీన్ని నిజమే అనుకుంది. ఆర్ ఆర్ ఆర్ కు ఇంకా ఏడాది దాకా టైం ఉంది. ఇప్పుడే ఫస్ట్ లుక్ లాంటి హంగామా అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here