కోట గోడలు బద్దలు అయ్యాయి…రజినీ సార్ ఏం చేస్తాడో!! | 123Josh.com
Home న్యూస్ కోట గోడలు బద్దలు అయ్యాయి…రజినీ సార్ ఏం చేస్తాడో!!

కోట గోడలు బద్దలు అయ్యాయి…రజినీ సార్ ఏం చేస్తాడో!!

0
5188

సౌత్ ఇండియా మాత్రమే కాకుండా దేశం మొత్తంలో మరియు కొన్ని దేశాల్లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు అశేష అభిమానగనం ఉండేది. రజినీకాంత్ ఏ సినిమా చేసినా కూడా కలెక్షన్స్ టాప్ లో ఉండేవి. రోబో వరకు రజినీకాంత్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వరద పారేది. రికార్డులే రికార్డులు. కాని ప్రస్తుత పరిస్థితి వేరు.

రజినీకాంత్ ఆరు పదుల వయసు దాటిన తర్వాత చేస్తున్న ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంలో విఫలం అవుతుంది. ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం అంతగా ఉండటం లేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్.. అజిత్ మరియు ఇంకా కొందరు యువ హీరోల ట్రెండ్ నడుస్తోంది.

ముఖ్యంగా విజయ్ ఏ సినిమా చేసినా కూడా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. గతంలో రజినీకాంత్ ఎలా అయితే వసూళ్లు దండుకునేవాడో ఇప్పుడు విజయ్ ఆ స్థాయిలో దూసుకు పోతున్నాడు. విజయ్ కలెక్షన్స్ ముందు రజినీకాంత్ కలెక్షన్స్ తేలిపోతున్నాయి. ఇటీవల విడుదల అయిన దర్బార్ చిత్రంకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here