చస్….ఇండియా లో నంబర్ 1 ఈయనే ఇప్పుడు!! | 123Josh.com
Home గుసగుసలు చస్….ఇండియా లో నంబర్ 1 ఈయనే ఇప్పుడు!!

చస్….ఇండియా లో నంబర్ 1 ఈయనే ఇప్పుడు!!

0
1562

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా కేటగిరిలో తెరకెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జాతీయ స్థాయి తారలు నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఏ విభాగంలోనూ రాజీకి రాకుండా బాహుబలిని మించి తెరకెక్కిస్తున్నామని దానయ్య టీమ్ చెబుతోంది.

ఆ క్రమంలోనే అంచనాలు పెరిగాయి. ఖర్చు చేసే ప్రతీ రూపాయి సినిమా లో విజువల్ గా కనిపిస్తుందని టీమ్ చెబుతోంది. జక్కన్న దాదాపు బాహుబలి కి పనిచేసిన టెక్నికల్ టీమ్ తోనే ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్నారు. తన ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో తెలియదు గానీ.. కీరవాణి పారితోషికం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా ఈ సినిమాకు మరకతమణి 16 కోట్లు ఛార్జ్ చేస్తున్నారుట. అదే నిజమైతే దేశంలోనే ఏ. ఆర్ రెహమాన్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి రికార్డుకు ఎక్కినట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here