చస్…ఈ 2 డేట్స్ లో RRR అప్ డేట్ పక్కా రాసిపెట్టుకోండి!! | 123Josh.com
Home గుసగుసలు చస్…ఈ 2 డేట్స్ లో RRR అప్ డేట్ పక్కా రాసిపెట్టుకోండి!!

చస్…ఈ 2 డేట్స్ లో RRR అప్ డేట్ పక్కా రాసిపెట్టుకోండి!!

0
497

ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్నట్టుగా గత కొంతకాలంగా రామారావు-రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేసేస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చి ఫ్యాన్స్ లో టెన్షన్ పెంచారు. కానీ ఇంతవరకూ అసలు ఇదీ అసలు సిసలు లుక్ అంటూ పోస్టర్లను మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రారంభంలో మీడియా సమావేశంలో రిలీజ్ చేసిన పోస్టర్ తప్ప అధికారికంగా ఏదీ రిలీజ్ కాలేదు. మొన్న జనవరి 1.. సంక్రాతి పండగలకు నిరాశపరిచారు.

ఇక ఇంతలోనే ఊహించని ట్విస్టు. ఇటీవలే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీని జూలై 30 నుంచి జనవరి 8కి వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఫస్ట్ లుక్ రిలీజ్ లు ఉంటాయా? అన్న సందేహం రెట్టింపైంది. కొమురం భీమ్ గా తారక్.. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పూర్తి లుక్ లు ఎలా ఉన్నాయి? అన్నది వీక్షించే భాగ్యానికి ఇంకా ఎంత కాలం వేచి చూడాలి? అంటే.. తాజా సమాచారం ప్రకారం..

రాజమౌళి ఇంకా వెయిట్ చేయించే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఇప్పటికే రెండు ఇంపార్టెంట్ తేదీల్ని లాక్ చేశారని రివీలైంది. మార్చి 27 (చరణ్ బర్త్ డే).. మే 20 (తారక్ బర్త్ డే) తేదీల్లో దివ్యమైన ముహూర్తం కుదిరిందిట. తొలిగా చరణ్ -సీతారామరాజు లుక్ ని ఆ తర్వాత తారక్ – కొమురం భీమ్ లుక్ ని రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here