చస్…గంటలో సైరా టీసర్ పై ట్వీట్స్ ఎన్నో తెలిస్తే షాక్!! | 123Josh.com
Home న్యూస్ చస్…గంటలో సైరా టీసర్ పై ట్వీట్స్ ఎన్నో తెలిస్తే షాక్!!

చస్…గంటలో సైరా టీసర్ పై ట్వీట్స్ ఎన్నో తెలిస్తే షాక్!!

0
2272

మెగాస్టార్ పేరుకున్న పవర్ ఏంటో చూపుతూ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహ రెడ్డి అఫీషియల్ టీసర్ 2 యూట్యూబ్ లో దూసుకు పోతుండగా సినిమా టీసర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో ఇండియా లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ట్రెండ్ అవుతూ భీభత్సం సృష్టించింది ఈ టీసర్.

రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఇండియా లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిన ఈ టీసర్ కేవలం 1 గంట వ్యవధిలో ఏకంగా 1 లక్షా 20 వేల కి పైగా ట్వీట్స్ పోల్ అయ్యాయట, ఇక ఇప్పటి వరకు ఏకంగా 2 లక్షల దాకా ట్వీట్స్ సైరా టీసర్ పై పడినట్లు సమాచారం.

సీనియర్ హీరోలలో ఇది ఆల్ టైం రికార్డ్ ట్వీట్స్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం అయితే…

పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక ట్రెండ్ పరంగా ఇండియా లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా టీసర్ వరల్డ్ వైడ్ గా టాప్ 15 ప్లేసు లలో మారుతూ ట్రెండ్ అవుతుంది. ఇక 24 గంటల్లో ఈ టీసర్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here