చాలా కష్టం…..కొడితే మాత్రం తోపే!! | 123Josh.com
Home న్యూస్ చాలా కష్టం…..కొడితే మాత్రం తోపే!!

చాలా కష్టం…..కొడితే మాత్రం తోపే!!

0
2663

ఈ నెల 20న విడుదల కానున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద మెగా ఫ్యాన్స్ కు మంచి అంచనాలే ఉన్నాయి. రెగ్యులర్ మూవీ గోయర్స్  మాత్రం దీని పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ వయసుకు మించిన గెటప్ లో తన సాఫ్ట్ ఇమేజ్ కి రిస్క్ అనిపించే బాడీ లాంగ్వేజ్ తో ఎంతవరకు మెప్పిస్తాడో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అందులోనూ కల్ట్ గా నిలిచిపోయిన ఒరిజినల్ తమిళ్ వెర్షన్ జిగర్ తండాతో పోలిక విషయంలో వాళ్లకు చాలా డౌట్స్ ఉన్నాయి.వరుణ్ చేసిన గద్దల కొండ గణేష్ పాత్ర అసలు వెర్షన్ లో చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబీ సింహా. అందుకే ఇమేజ్ లాంటి ప్రతిబంధకాలు ఏవి లేకపోవడంతో దర్శకుడు స్వేచ్ఛగా కథను చెప్పాడు. హిట్టు కొట్టాడు.

కన్నడంలోనూ విలన్ రవి శంకర్ ను ఈ పాత్రకు తీసుకున్నారు. ఫ్లేవర్ చెడిపోకుండా తానూ దాన్ని సమర్ధవంతంగా పోషించి పాస్ చేయించాడు. ఎటొచ్చి ఆ ఇద్దరితో పోలిస్తే వరుణ్ తేజ్ అన్ని కోణాల్లోనూ చాలా చాలా చిన్నవాడు. ఇమేజ్ ఫాలోయింగ్ లాంటి అడ్డంకులు ఉన్నవాడు.మరి హరీష్ శంకర్ ప్రయోగాత్మకంగా చేసిన ఈ కమర్షియల్ సినిమా ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here