చిరు 152….రామ్ చరణ్ షాకింగ్ డిసిషన్!! | 123Josh.com
Home గుసగుసలు చిరు 152….రామ్ చరణ్ షాకింగ్ డిసిషన్!!

చిరు 152….రామ్ చరణ్ షాకింగ్ డిసిషన్!!

0
1851

రీసెంట్ గా చిరు 152 లో నక్సలైట్ పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో మెగా అభిమానుల్లో జోష్ కట్టలు తెంచుకుంది. తమ అభిమాన హీరోలిద్దరినీ మరోసారి ఒకే ప్రేమ్ లో చూసుకునే భాగ్యం కలుగుతోందని సంతోషం వ్యక్తం చేసారు. ఈ కాంబినేషన్ అనగానే అంచనాలు స్కైని టచ్ చేసాయి. అయితే ఇంతలోనే ఊహించని షాక్ తినాల్సి వస్తుందన్నది ఫ్యాన్స్ ఊహించలేకపోయారు. తాజాగా చిరు 152 నుంచి చరణ్ తప్పుకున్నారని తెలుస్తోంది.

అయితే ఇంతలోనే సడెన్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటి? అంటే .. రాజమౌళికి ఇచ్చిన మాట ప్రకారం చరణ్ తప్పుకోక తప్పలేదన్న కథనాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` పూర్తయ్యే వరకూ చరణ్ మరో సినిమాకి కాల్షీట్లు కేటాయించొద్దనేది జక్కన్న కండీషన్. ఆ నియమం ప్రకారమే చరణ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ పూర్తయి రిలీజయ్యాకే చరణ్ నటించిన ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వాలన్నది మరో కండీషన్.

కొరటాలకు కాల్షీట్లు కేటాయించాలన్నా .. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాతనే పాజిబుల్. కానీ అప్పటివరకూ కొరటాల వెయిట్ చేసే సీన్ కనిపించడం లేదు. ఇప్పటికే మెగాస్టార్ కోసం ఏకంగా రెండేళ్లు వెయిట్ చేసారు. చరణ్ కోసం మరో ఏడాది వెయిట్ చేయడం అంటే తనకి ఇబ్బందికర పరిస్థితే. ఇదే డాడ్ సినిమా నుంచి చరణ్ తప్పుకోవడానికి కారణమని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here