జాను ఎఫెక్ట్….రీమేక్ పై చిరు డౌట్స్!! | 123Josh.com
Home గుసగుసలు జాను ఎఫెక్ట్….రీమేక్ పై చిరు డౌట్స్!!

జాను ఎఫెక్ట్….రీమేక్ పై చిరు డౌట్స్!!

0
585

జాను తమిళం 96 రీమేక్ అన్న ప్రచారంతో పాటు.. ఆన్ లైన్ లో ఈ సినిమా అందుబాటులో ఉండటం.. అమెజాన్ లోనూ ఉండటంతో.. ఈ సినిమాను తమిళ్ వెర్షన్ లోనే పిచ్చి పిచ్చిగా చూసేశారు. చూసిన సినిమాను మళ్లీ పెద్ద తెర మీద డబ్బులు పెట్టి చూడటం ఇబ్బందే. అందుకే.. ఒరిజినల్ చూశాం కదా? అందులో త్రిషకు బదులు సమంతను ఊహించుకుంటే సరిపోతుందని సరిపెట్టుకున్నోళ్లు తక్కువేం కాదంటున్నారు.

ఇదిలా ఉంటే.. చిరు నటిస్తారని చెబుతున్న లూసిఫర్ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 96 తెలుగులో డబ్ చేయలేదు. కానీ.. మలయాళం మూవీ లూసిఫర్ ను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి వదిలారు. మోహన్ లాల్ నటించిన ఈ మూవీ తెలుగులో ఆడలేదు. ఎప్పుడు విడుదలైందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలీదు. మాలీవుడ్ లో మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది.

ఇలాంటి వేళ.. ఈ సినిమాను రీమేక్ చేయటం తప్పేం కాదు. కానీ.. సమస్య ఏమిటంటే.. లూసిఫర్ తెలుగు వెర్షన్ అమెజాన్ లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. సెర్చ్ లోకి వెళ్లి చూస్తే చాలు.. ఈ సినిమా వచ్చేస్తుంది. అలాంటి అవకాశం ఉన్నప్పుడు.. ఎన్ని మార్పులు చేస్తే మాత్రం.. మూలకథలో మార్పు అయితే ఉండదు కదా? చిరునటిస్తున్న రీమేక్ అన్నంతనే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆ సినిమా ఎలా ఉంటుందో చూద్దామని చూడటం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here