జాను డిసాస్టర్…హీరో కి నో చెప్పిన సమంత?? | 123Josh.com
Home గుసగుసలు జాను డిసాస్టర్…హీరో కి నో చెప్పిన సమంత??

జాను డిసాస్టర్…హీరో కి నో చెప్పిన సమంత??

0
732

శర్వానంద్-సమంత జంటగా నటించిన `జాను` భారీ అంచనాల నడుమ రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ భ్లాక్ బస్టర్ 96 కి రీమేక్ గా తెరకెక్కడంతో సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని దర్శకనిర్మాతలు భావించారు. కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సీస్ రివర్స్ అయింది. తొలి రోజు డివైడ్ టాక్ రావడం..ఒరిజినల్ లో ఉన్న ఫీల్ `జాను`లో మిస్సయ్యిందని రక రకాలుగా భినాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో అంచనాలను అందుకో లేకపోయింది.

దీంతో వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న సమంత కి ఏడాది ఆరంభం లోనే జాను రూపంలో పెద్ద షాక్ తగిలినట్లైంది. కొత్త ఏడాదిని సంతోషంగా ప్రారంభిచాలని ఆశించిన సామ్ కి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇటీవలి కాలంలో వెంటపడిన పలు అవకాశాలను వ్యక్తిగత కారణాలుగా వద్దనుకుంటోంది. జానుతో సక్సెస్ అందుకుని కొన్ని నెలల పాటు రిలాక్స్ అవ్వాలని భావించిందట.

కానీ ఫలితం తేడా కొట్టింది. ఇప్పుడా పరాజయం యంగ్ హీరో శర్వానంద్ కు పెద్ద చిక్కుగా మారిందట. శర్వా హీరోగా ఆర్ ఎక్స్ -100 దర్శకుడు `మహాసముద్రం` చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.. అందులో సమంత నాయిక అనుకున్నారు. కానీ ఇప్పుడు జాను ఎఫెక్టు తో సామ్ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాపైనట్టేనని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here