టాలీవుడ్ 2020 బ్లాక్ బస్టర్ హిందీ రీమేక్! | 123Josh.com
Home న్యూస్ టాలీవుడ్ 2020 బ్లాక్ బస్టర్ హిందీ రీమేక్!

టాలీవుడ్ 2020 బ్లాక్ బస్టర్ హిందీ రీమేక్!

0
3277

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఇంట్రస్ట్ చూపిస్తోంది. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు హీరోలు సైతం మెచ్చుకున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.

హిందీలో బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్  రీమేక్ చిత్రాన్ని నిర్మించనుండగా ఇందులో స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఇక కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఇక్కడి ‘అర్జున్ రెడ్డి’ అక్కడి ‘కబీర్ సింగ్’ గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పడు ‘జెర్సీ’ ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాలు కూడా హిందీ రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా రైట్స్ కూడా కరణ్ జోహార్ వద్దే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నితిన్ ‘భీష్మ’ కూడా చేరిపోయింది. మరి ఇక్కడ హిట్ అయిన సినిమా బాలీవుడ్లో ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here