డిసాస్టర్ మూవీ తో యూట్యూబ్ రికార్డులు తిరగరాసిన విజయ్ దేవరకొండ! | 123Josh.com
Home న్యూస్ డిసాస్టర్ మూవీ తో యూట్యూబ్ రికార్డులు తిరగరాసిన విజయ్ దేవరకొండ!

డిసాస్టర్ మూవీ తో యూట్యూబ్ రికార్డులు తిరగరాసిన విజయ్ దేవరకొండ!

0
9467

విజయ్ దేవరకొండ.. రష్మిక మందన కాంబినేషన్ లో రూపొంది భారీ అంచనాల మధ్య విడుదలైన యూత్ ఫుల్ మూవీ డియర్ కామ్రేడ్. టాలీవుడ్ లో రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ తెచ్చుకొని భారీ లెవెల్ లో బిజినెస్ కోల్పోయింది. ఇక పాటలు హిట్ అయినా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మిగిలిన విషయం తెలిసిందే.

ఆ సినిమా ఇప్పుడు టాలీవుడ్ తరుపున హిందీలో డబ్ అయి విడుదలైన సినిమాలలో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. హిందీలో డబ్ అయిన అన్ని సినిమాలలో హైయెస్ట్ లైక్స్ సొంతం చేసుకున్న సినిమాగా డియర్ కామ్రేడ్ మూవీ సంచలన రికార్డ్ నమోదు చేసింది. ఏకంగా 1.6 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది డియర్ కామ్రేడ్.

ఇక వ్యూస్ పరంగా 130 మిలియన్ల పై దూసుకెళ్తున్నా.. లైక్స్ మాత్రం వీర లెవల్ లో సాధించి ఇతర సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా.. దీని తర్వాత 1.3 మిలియన్ల లైక్స్ తో జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ మూవీ రెండవ స్థానంలో ఉంది. ఇక హలో గురు ప్రేమకోసమే.. ఇస్మార్ట్ శంకర్.. సరైనోడు.. అఆ.. ఇలా అన్నింటి కన్నా హైయెస్ట్ లైక్స్ సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here