డిసాస్టర్ సినిమా ఏంటి…ఆస్కార్ ఎంట్రీ ఏంటి!! | 123Josh.com
Home న్యూస్ డిసాస్టర్ సినిమా ఏంటి…ఆస్కార్ ఎంట్రీ ఏంటి!!

డిసాస్టర్ సినిమా ఏంటి…ఆస్కార్ ఎంట్రీ ఏంటి!!

0
3262

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ఎంట్రీస్ కి మన తెలుగు సినిమా ఎంపికైంది అంటే అంతకంటే గుడ్ న్యూస్ ఏం ఉంటుంది? అలాంటి ప్రయత్నం జరుగుతోంది. రౌడీ బోయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ (2019) ఆస్కార్ బరిలో ఇండియా తరపు నుంచి పోటీ పడేందుకు పరిశీలనకు వెళ్లిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఇండియా తరపున 28 సినిమాల జాబితా లో డియర్ కామ్రేడ్ ఒకటిగా ఉంది.

ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) ప్రతినిధులు మన దేశం నుంచి 28 సినిమాల్ని సెలెక్ట్ చేస్తే అందులో `డియర్ కామ్రేడ్` ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మన పరిశ్రమ నుంచి ఈ సినిమా స్థానం సంపాదించడం అభిమానుల్లో ఆనందం నింపుతోంది. అయితే ఆ జాబితాలో 2019 బెస్ట్ హిట్ సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి.

2019 బ్లాక్ బస్టర్ చిత్రాలు అంధాధున్ – యూరి- బదాయి హో- గల్లీ బోయ్ రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఇతర భాషల నుంచి కూడా పలు చిత్రాలు నామినేషన్ కేటగిరీలో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే తెలుగు సినీపరిశ్రమ నుంచి బరిలో నిలిచింది రౌడీ గారి సినిమా మాత్రమేనన్నది బిగ్ సర్ ప్రైజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here