దసరా కే సై అంటున్న మెగాస్టార్!! | 123Josh.com
Home గుసగుసలు దసరా కే సై అంటున్న మెగాస్టార్!!

దసరా కే సై అంటున్న మెగాస్టార్!!

0
2699

‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చేసే చిత్రం ఏమిటనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. అయితే చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో మన నేటివిటీకి తగ్గట్లు సుజీత్ మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన అయితే ఇంతవరకు వెలువడలేదు. ఇదిలా ఉండగా అన్ని కుదిరితే తెలుగు ‘లూసిఫర్’ విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here