నాని తప్పించుకున్నాడు…కొండ ఇరుక్కున్నాడు | 123Josh.com
Home గుసగుసలు నాని తప్పించుకున్నాడు…కొండ ఇరుక్కున్నాడు

నాని తప్పించుకున్నాడు…కొండ ఇరుక్కున్నాడు

0
1355

ఒకరికి వినిపించిన కథ అక్కడ రిజెక్ట్ అయ్యాక ఇంకొకరికి కనెక్టయ్యింది. అలా విజయ్ కి కనెక్టయినదే `వరల్డ్ ఫేమస్ లవర్`. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ సహా ఆడియెన్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది.

విజయ్ – నిర్మాత కె.ఎస్ రామారావు ఈ స్క్రిప్టును ఎంతో బలంగా నమ్మి చేసారు. మరో అర్జున్ రెడ్డిలా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉండేవారు. కానీ తానొకటి తలిస్తే అన్న చందంగా అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. హీరో రైటర్ అవ్వడం.. తన కథల్లో తానే హీరో అని ఊహించుకుని ఊహాలోకంలో తేలిపోవడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు అంతగా రుచించలేదు.

అయితే ఈ స్క్రిప్ట్ ముందుగా నేచురల్ స్టార్ నానికి క్రాంతి మాధవ్ వినిపించారట. ప్రథమార్థం విన్న తర్వాత అటుపై ఇంకా వినేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదుట. ఇప్పుడే వచ్చేస్తానంటూ స్కిప్ కొట్టాడని గుసగుస వినిపిస్తోంది. ద్వితియార్థం కథ అసలు నానీ వినకుండా పదే పదే ఎస్కేప్ అయ్యాడట. దీంతో విషయాన్ని గ్రహించిన క్రాంతి మాధవ్ చివరిగా విజయ్ దేరకొండని బుట్టలో వేశారన్న గుసగుసా వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here