న్యూమరాలజీ చిక్కుల్లో ఇరుక్కున్న పవర్ స్టార్ సినిమా!! | 123Josh.com
Home గుసగుసలు న్యూమరాలజీ చిక్కుల్లో ఇరుక్కున్న పవర్ స్టార్ సినిమా!!

న్యూమరాలజీ చిక్కుల్లో ఇరుక్కున్న పవర్ స్టార్ సినిమా!!

0
708

PSPK 26 టైటిల్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్ టైటిల్ కే ఒకే చెప్పారట. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. పవన్ విశ్వసించే రెగ్యులర్ జ్యోతిష్యులు `లాయర్ సాబ్` టైటిల్ అయితేనే కలిసొస్తుందని.. దానినే టైటిల్ గా ఫిక్స్ చేయమని సూచించారుట.

వకీల్ సాబ్ అనేది పవన్ పేరు బలాన్ని బట్టి ఏమాత్రం బాగా లేదని…ఆ టైటిల్ పెడితే గానీ కలిసిరాదని కరాఖండీ గా చెప్పేసారుట. దాంతో `లాయర్ సాబ్` నే పవన్ ఫిక్స్ చేయండని చిత్ర బృందానికి సూచించారట. అయితే చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం `వకీల్ సాబ్` అయితేనే బాగుంటందని పవన్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారట.

కానీ పవన్ అందుకు ససేమీరా అనేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ భక్తి.. ధ్యానం నమ్మకాల గురించి తెలిసిందే. స్వామీజీలు.. జ్యోతిష్యుల్ని ఆయన గౌరవిస్తారు.. బలంగా నమ్ముతారు. అందుకే పీఎస్ పీకే 26 టైటిల్ `లాయర్ సాబ్` అని ఫిక్స్ అవ్వాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here