పవర్ స్టార్ జోరు అదుర్స్….జులై నుండి దుమ్ము లేపడమే ఇక!! | 123Josh.com
Home గుసగుసలు పవర్ స్టార్ జోరు అదుర్స్….జులై నుండి దుమ్ము లేపడమే ఇక!!

పవర్ స్టార్ జోరు అదుర్స్….జులై నుండి దుమ్ము లేపడమే ఇక!!

0
1140

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగులో బిజీ ఉండగానే తన తదుపరి చిత్రం పనులను శరవేగంగా మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ హిందీ నుండి రీమేక్ చేస్తుండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అలాంటిది తదుపరి చిత్రం విరూపాక్ష గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పండగే. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏయం రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుంది.

ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని తెలిపారు. ఈ చారిత్రాత్మక కథను క్రిష్ కూడా పవన్ ఇమేజ్ కి సరిపోయేలా తయారు చేసాడట. చారిత్రాత్మక చిత్రం కావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here