పాపం శర్వానంద్…ఆ ఎఫెక్ట్ గట్టిగా పడింది గా!! | 123Josh.com
Home గుసగుసలు పాపం శర్వానంద్…ఆ ఎఫెక్ట్ గట్టిగా పడింది గా!!

పాపం శర్వానంద్…ఆ ఎఫెక్ట్ గట్టిగా పడింది గా!!

0
2614

శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం అనే సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు శాటిలైట్.. డిజిటల్ రైట్స్ మాత్రం ఆశించిన విధంగా రావడం లేదట. చాలా తక్కువ రేట్లకు అడుగుతూ ఉండడంతో నిర్మాతలకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట. దీనికి కారణం శర్వా వరసగా ఎదుర్కొన్న హ్యాట్రిక్ ఫ్లాపులే అనే టాక్ వినిపిస్తోంది.

శర్వా నటించిన ‘పడి పడి లేచే మనసు’.. ‘రణరంగం’.. ‘జాను’ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లుగా నిలవడంతో కొత్త సినిమాకు డిమాండ్ తగ్గిందని.. దానికి తోడు ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ కావడంతో హైప్ రావడం లేదని అంటున్నారు. మరి ఈ పరిస్థితులలో ‘శ్రీకారం’ సినిమాకు హైప్ ఎలా పెంచుతారో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here