పాపం సుజీత్ ని ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు గా!! | 123Josh.com
Home గుసగుసలు పాపం సుజీత్ ని ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు గా!!

పాపం సుజీత్ ని ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు గా!!

0
1649

వసూళ్లు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని ఎంత చెప్పుకున్నా సాహో అధికశాతం జనామోదం పొందలేదన్నది వాస్తవం. 350 కోట్ల బడ్జెట్ తో తీసిన స్థాయిలో సినిమా లేదని పేరు గొప్ప ఊరు దిబ్బ అనే రేంజ్ లో దర్శకుడు సుజిత్ దీన్ని తెరకెక్కించాడని ఇప్పటికే ఫ్యాన్స్ ఫైర్ అవుతూనే ఉన్నారు.

సోషల్ మీడియా గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ తమ అక్కసును చెప్పుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా అందరూ సుజిత్ నే టార్గెట్ చేస్తున్నారు.హీరోయిజం ఎలివేట్ అయ్యేలా కొన్ని సీన్లు కాపీ కొట్టినట్టు అనిపించే రెండు మూడు డైలాగులు రాసుకుంటే సరిపోదని

ప్రేక్షకులను మెప్పించేలా కంటెంట్ ని ఎలా ప్రెజెంట్ చేయలన్న కామన్ సెన్స్ ఉండాలని ఇలా రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇది ఇంకొద్ది రోజులు సాగేలా ఉంది. కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్నప్పటికీ నిర్మాతలు హీరో అంత పెద్ద బాద్యతను అప్పజెబితే స్క్రీన్ ప్లే బేస్డ్ అని చెప్పి ఇలా తీస్తారా అని నిలదీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here