పుష్ప లేటెస్ట్ షూటింగ్ అప్ డేట్ ఇదే!

0
1838

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే ఈ పాన్ ఇండియా యాక్షన్ సినిమా ఇదివరకు తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో.. కేరళ అడవుల్లో షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ రషెస్ చూసి డైరెక్టర్ సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తనకు కావాల్సిన అవుట్ ఫుట్ రాబట్టుకోవడంలో డైరెక్టర్ సుకుమార్ దిట్ట అనే సంగతి తెలిసిందే. అలాంటిది రషెస్ చూసి సాటిస్ఫాక్షన్ చెందాడంటే యాక్షన్ ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి చిత్రబృందం వెంటనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. లాక్డౌన్ ముగియడంతో షూటింగ్స్ అన్ని మొదలవుతున్నాయి. సో పుష్ప బృందం కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించే ప్రణాళిక సిద్ధం చేస్తోందట. అయితే ఈసారి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేసినట్లు సమాచారం. 30రోజుల పాటు జరుపనున్న ఈ షెడ్యూల్లో కీలక యాక్షన్ ఘట్టాలతో పాటుగా పుష్పారాజ్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here