పెర్ఫెక్ట్ డేట్ కి దిగబోతున్న విజయ్ దేవరకొండ!! | 123Josh.com
Home గుసగుసలు పెర్ఫెక్ట్ డేట్ కి దిగబోతున్న విజయ్ దేవరకొండ!!

పెర్ఫెక్ట్ డేట్ కి దిగబోతున్న విజయ్ దేవరకొండ!!

0
1002

యువ హీరో విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది కానీ మధ్యలో విజయ్ ‘డియర్ కామ్రేడ్’ పై దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది.  అయితే త్వరలోనే విజయ్ ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడట.  

వరల్డ్ ఫేమస్ లవర్  ఒక షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందట.  త్వరలోనే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొడతారట.  ఇక ఈ సినిమా కు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయట.  ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. 

ఈ సినిమాలో విజయ్ ఒక లవర్ బాయ్.. కాసనోవా తరహా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు వాలెంటైన్స్ డే నాడు విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here