ప్రభాస్ ఈ ఏడాది కూడా కనిపించడు??

0
1957

కరోనా కారణంగా ఈ నెల 31వరకు సినిమా థియేటర్లు కూడా మూసివేయడం జరిగింది. మరి కరోనా బారినుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను లాక్ డౌన్ చేసింది. ఈ పరిస్థితిలో అసలు కరోనా పరిస్థితులు చక్కబడేది ఎప్పుడు.. మేం షూటింగులు పూర్తిచేసేది ఎప్పుడనే.. సందేహాలతో ప్రభాస్ చిత్రయూనిట్ వాపోతున్నట్లు సమాచారం.

ఇక ఇదే తంతు గనక కంటిన్యూ అయితే దేశంలోని అన్ని సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చోవడమే దిక్కుగా కన్పిస్తుంది. దీన్ని బట్టి ప్రభాస్ 20వ సినిమా ఇప్పట్లో పూర్తికాదని అర్ధమవుతుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ ప్రేక్షకులు భారీ ఆశలనే పెట్టుకున్నారు. ఈ కరోనా నుండి బయటపడేది ఎప్పుడో తెలీదు కనుక ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది పూర్తికాదు కావచ్చు అని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే ఈ సినిమాను వచ్చే ఏడాది రావడం ఖాయమని అనుకుంటున్నారు సినీ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here