ప్రభాస్ ఫ్లాఫ్ మూవీ తో 2020 లో కొత్త రికార్డ్ కొట్టాడు!! | 123Josh.com
Home న్యూస్ ప్రభాస్ ఫ్లాఫ్ మూవీ తో 2020 లో కొత్త రికార్డ్ కొట్టాడు!!

ప్రభాస్ ఫ్లాఫ్ మూవీ తో 2020 లో కొత్త రికార్డ్ కొట్టాడు!!

0
3803

రిపబ్లిక్ డే సందర్బంగా జీ సినిమా ఛానెల్ లో జనవరి 26న ప్రభాస్ నటించిన సాహో సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ వేయడం జరిగింది. అనూహ్యంగా ఈ చిత్రానికి భారీ స్పందన వచ్చింది. టీవీల్లో కూడా ఈ సినిమాను తెగ చూశారు. 2020 నాల్గవ వారంలో రేటింగ్ విషయంలో సాహో మొదటి స్థానం లో నిలిచింది. ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాహోనే టాప్ ప్లేస్ లో నిలిచింది.

ప్రభాస్ ను హిందీ ప్రేక్షకులు ఏ విధంగా అభిమానిస్తున్నారో ఈ రేటింగ్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. సాహో చిత్రం థియేటర్ల లో.. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై చూసి కూడా మళ్లీ చాలా మంది ప్రేక్షకులు జీ సినిమా ఛానెల్ లో చూసేందుకు ఆసక్తి చూపడం వల్లే ఈ స్థాయి రేటింగ్ నమోదు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో తన స్థానంను మరింత పదిలం చేసుకున్నాడు.

బాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలిచి సాహో మొదటి స్థానం ను దక్కించుకోవడం తో బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యింది. సహజంగా ఈ స్థాయి రేటింగ్ కేవలం బాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే వస్తుంది. ప్రభాస్ కు ఆ రేటింగ్ నమోదు అవ్వడంతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదని మరోసారి నిరూపితం అయ్యిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here