ఫాలోవర్స్ లో పోటి పడుతున్న చిరు-చరణ్ లు! | 123Josh.com
Home న్యూస్ ఫాలోవర్స్ లో పోటి పడుతున్న చిరు-చరణ్ లు!

ఫాలోవర్స్ లో పోటి పడుతున్న చిరు-చరణ్ లు!

0
1512

మెగా డాడ్.. మెగా సన్ ఇద్దరూ ట్విట్టర్ లో అర్థ మిలియన్ ఫాలోయర్ మార్కును దాటడం విశేషం. చిరంజీవి ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం 508k ఫాలోయర్లున్నారు.  ఇదే చరణ్ ఖాతాకు 505k అనుచరులున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. చరణ్ ల జోరు చూస్తుంటే మరో రెండుమూడు నెలల లోపే వన్ మిలియన్ ఫాలోయర్ల మార్క్ చేరుకుంటారని అంటున్నారు.

నిజానికి గతంలో పోలిస్తే ట్విట్టర్ లో ఇప్పుడు ఎక్కువమంది యువత యాక్టివ్ గా ఉండడం లేదు.  ఇన్స్టా గ్రామ్.. టిక్ టాక్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలవైపు ఈ తరంవారు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.  దీంతో ట్విట్టర్లో కొత్తగా జాయిన్ అయిన సెలబ్రిటీలకు ఫాలోయర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరగడం లేదు. 

అదే టిక్ టాక్ లాంటివి రాక మునుపు సెలబ్రిటీలకు ఎక్కువ సంఖ్యలో ఫాలోయర్లు తక్కువ సమయంలో వచ్చేవారు. చిరంజీవి.. చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలో ఎక్కువగా అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఫాలోయర్స్ నంబర్ పెరుగుతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here