ఫేక్ కలక్షన్స్ పై అల్లు అర్జున్ దిమ్మ తిరిగే కౌంటర్ పోస్టర్!! | 123Josh.com
Home న్యూస్ ఫేక్ కలక్షన్స్ పై అల్లు అర్జున్ దిమ్మ తిరిగే కౌంటర్ పోస్టర్!!

ఫేక్ కలక్షన్స్ పై అల్లు అర్జున్ దిమ్మ తిరిగే కౌంటర్ పోస్టర్!!

0
1240

ఇక కొందరు హీరోలు.. నిర్మాతలు స్వయంగా ఫేక్ కలెక్షన్లను ప్రచారంలోకి తీసుకొచ్చి తమ సినిమాను గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు.  ఏవి రియల్ కలెక్షన్స్.. ఏవి ఫేక్ అనేది కనుక్కోవడం సాధారణ ప్రేక్షకులకు చాలా కష్టం. తాజాగా ఈ  ఫేక్ కలెక్షన్స్ పై అల్లు అర్జున్ సెటైర్ వేసేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురము లో’ నిన్న రిలీజ్ అయింది.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లలో ఊహకు అందని కలెక్షన్ ఫిగర్లను ముద్రించాలని.. ఫేక్ కలెక్షన్లపై సెటైర్  వెయ్యాలని అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ టీమ్ కు సూచించారట. దీంతో ఫేక్ కలెక్షన్స్ ను చెలామణిలోకి తీసుకొస్తున్న వారికి.. వాటిని నమ్ముతున్న చాలామందికి ఒక పంచ్ వేసినట్టు ఉంటుందని అన్నారట. త్వరలో ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ‘అవతార్’ సినిమా రేంజ్ కలెక్షన్ ఫిగర్స్ ను చూడొచ్చన్నమాట.  

అయితే అల్లు అర్జున్ సెటైర్ ఎవరి మీద అనే విషయం తెలివైన పాఠకులకు చిటికెలో అర్థం అయి ఉంటుంది. ఎందుకంటే ఈతరంలో పప్పు-లు చాలా తక్కువగా ఉంటారు. ఉండే జనాలందరూ దేశముదుర్లే.  వారికి ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా హింట్స్ ఇవ్వాల్సిన పనే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here