గత నెల లో ఇటాలియన్ షెడ్యూల్ తరువాత డిసెంబర్ 13 నుంచి హైదరాబాద్ లో ఒక ప్రధాన షెడ్యూల్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు రాధే శ్యామ్ సినిమా యూనిట్…. యూనిట్ ప్రస్తుతం కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తోంది.
తాజా నివేదికల ప్రకారం.. రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షెడ్యూల్ కోసం పాతకాలపు ఇటలీని పోలిన నాలుగు వేర్వేరు సెట్లను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు సెట్లలో షూటింగ్ జరుగుతోంది. ఈ నెల చివరి వరకు కొనసాగనున్న షెడ్యూల్ లో
ప్రభాస్ – పూజా హెగ్డేతో పాటు ఇతర ప్రధాన నటులు పాల్గొంటున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపికృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.