ఫ్యాన్స్ కి తిరుగు లేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్!! | 123Josh.com
Home గుసగుసలు ఫ్యాన్స్ కి తిరుగు లేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్!!

ఫ్యాన్స్ కి తిరుగు లేని గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్!!

0
1446

యంగ్ టైగర్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అధికారికంగా కన్ఫామ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో నిర్మాతలుగా ఎస్.రాధాకృష్ణ(చినబాబు)- నందమూరి కళ్యాణ్ రామ్ పేర్లను ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ తారక్ 30వ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అంటే ఆ ఇద్దరినీ కలిపేందుకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే దీనర్థం. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ‘అయినను పోయి రావలె హస్తినకు` అనే టైటిల్ ని ఖరారు చేసారని ప్రచారమైనా.. టైటిల్ ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

ఇక ఈ క్రేజీ మూవీలోనూ కథానాయికగా పూజా హెగ్డేని త్రివిక్రమ్ లాక్ చేశారని .. రష్మిక కూడా ఓ కథానాయికగా నటించనుందని ఇంతకుముందు ప్రచారమైంది. అయితే కథానాయికలకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇతర కాస్టింగ్ క్రూ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here