బాలయ్య – అఘోరా…నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!! | 123Josh.com
Home గుసగుసలు బాలయ్య – అఘోరా…నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!!

బాలయ్య – అఘోరా…నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!!

0
816

NBK 106 ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ విషయంలో బాలయ్య సంతృప్తిగా లేకపోవడంతో బోయపాటి ని పక్కా స్క్రిప్ట్ తో రమ్మని ఆదేశాలిచ్చారు. ఆ క్రమంలోనే అతడు గత నెలరోజులుగా అదే పనిలో ఉన్నారు. స్క్రిప్టు దశలోనే ఈసారి ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటున్నారని సమాచారం. ఎట్టకేలకు బాలయ్య ను వందశాతం స్క్రిప్టుతో బోయపాటి మెప్పించారట.

నటసింహా ఇమేజ్ కు తగ్గ అంశాలు పుష్కలంగా ఉంటూనే కొత్త జానర్ ని బోయపాటి టచ్ చేస్తున్నాడట. ఇప్పటికే బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం వేడెక్కిస్తుంది.ఇందులో అఘోరా పాత్రలో బాలయ్య సర్ ప్రైజ్ చేస్తారన్న సమాచారం ఇప్పటికే రివీలైంది.  స్క్రిప్ట్  డిమాండ్ చేయడంతోనే బాలయ్య అఘోర గెటప్ లో కనిపించడానికి ఒప్పుకున్నారుట.

దీంతో మరోసారి బాలయ్య దర్శకుల హీరో అనిపించారు. దర్శకుడి దిశానిర్ధేశనం మేరకు ఆయన ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారని అభిమానులు చెబుతుంటారు. అఘోరా తరహా పాత్రలో నటించడం అన్నదే ఓ ఛాలెంజ్.. అనుకుంటే అప్పుడే బాలయ్య బరిలో దిగిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ ను అఘోరా గెటప్ పై చిత్రీకరించేందుకు వారణాసి వెళుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here